Friday, January 9, 2015

గోరుచిక్కుడు

 గోరుచిక్కుడు ని చాలా రకాలుగా వండవచ్చు
మొదటిది  : బెల్లం సున్నిపిండి గోరుచిక్కుడు
సమయం :అర్ద గంట 
కావలసిన పదార్దాలు : గోరుచిక్కుడు, పర్చిమిర్చి, ఉప్పు,చింతపండు  ,సున్నిపిండి (మినప పిండి ), బెల్లం , ఆవాలు,జీలకర్ర ,శనగపప్పు,నూనె.

తయారీ విధానం :1 గోరుచిక్కుడుని,ఉప్పు, పర్చిమిర్చి,చింతపండు  తో సహా పాలర్చి (ఉడకబెట్టాలి).
                          2. తాలింపు వేసుకోవాలి (ఆవాలు,జీలకర్ర ,శనగపప్పు,నూనె) వేరే గిన్నెలో.
                          3.  పాలర్చన  గోరుచిక్కుడుని  ఈ తలింపులో  వేసి కొంచం సేపు మగ్గనివ్వాలి.
                          4.  సున్నిపిండి ఇoకా బెల్లంని సరిపాళ్ళలో తీసుకుని ఆ మగ్గిన ముక్కలకి వేడి తగ్గినా తరువాత కలపాలి 

రెండవది:  గోరుచిక్కుడు వెల్లులి  కారం
సమయం :అర్ద గంట  
 కావలసిన పదార్దాలు : గోరుచిక్కుడు, ఉప్పు, ఆవాలు, శనగపప్పు,నూనె,వెల్లులి  కారం(వెల్లులి ,ఎండు  మిరపకాయలు,జీలకర్ర మిశ్రమం )
తయారీ విధానం : :1 గోరుచిక్కుడుని,ఉప్పు, పర్చిమిర్చి,చింతపండు  తో సహా పాలర్చి (ఉడకబెట్టాలి).
                            2. తాలింపు వేసుకోవాలి (ఆవాలు,జీలకర్ర ,శనగపప్పు,నూనె) వేరే గిన్నెలో.
                            3.  పాలర్చన  గోరుచిక్కుడుని  ఈ తలింపులో  వేసి కొంచం సేపు మగ్గనివ్వాలి.
                            4. వెల్లులి  కారం ని కలపి కొంచం సేపు మగ్గ నివ్వాలి